హుస్నాబాద్‌లో నూతన కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వ జీవో జారీ

*40 మంది క్రీడాకారులకు వసతితోకూడిన కబడ్డీ అకాడమీ ఏర్పాటు

ప్రతిపక్షం బ్యూరో, ఉత్తర తెలంగాణ, అక్టోబర్ 16: హుస్నాబాద్ నియోజకవర్గంలో క్రీడాభివృద్ధికి మరో ముందడుగు పడింది. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గారి కృషితో హుస్నాబాద్ నియోజకవర్గంలో నూతన కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది.యువతలో క్రీడా ప్రతిభను వెలికితీసి, గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించాలనే లక్ష్యంతో ఈ అకాడమీ ఏర్పాటు కానుంది.

క్రీడాకారులకు ప్రయోజనం
ఈ అకాడమీ ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల యువ క్రీడాకారులకు కబడ్డీలో శిక్షణ పొందేందుకు అవకాశాలు మెరుగుపడనున్నాయి. బాలురు, బాలికలకు సమానంగా అవకాశం కల్పించడం ద్వారా క్రీడల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు దోహదపడనుంది.హుస్నాబాద్ ప్రాంతంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ అకాడమీ ఏర్పాటు కీలక అడుగుగా నిలవనుంది.ఇప్పటికీ హుస్నాబాద్ నియోజకవర్గంలోనీ గ్రామాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ గుర్తింపు సాధించారు. కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు హుస్నాబాద్ నియోజకవర్గంలోని పల్లెల్లో మట్టిలో మాణిక్యాలు వెలికి తీసి అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేయవచ్చని నియోజకవర్గ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

జీవో వివరాలు: G.O.Rt.No.1660, ఆర్థిక శాఖ (HRM.VII), తేదీ: 15-10-2026.

మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చొరవతో హుస్నాబాద్ నియోజకవర్గంలో క్రీడాకారులకు కొత్త అవకాశాలు అందుబాటులోకి రావడంపై నియోజకవర్గ ప్రజలు , విద్యార్థులు , యువత స్థానిక క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Spread the love

Related News

Latest News