ధనుర్మాసోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ నవంబర్ 28: మెదక్ పట్టణంలోని కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి పల్లకి సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, అభిషేకం, ప్రత్యేక అలంకరణ, మహా మంగళహారతి నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు భజన పాటలు ఆలపిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అనంతరం స్వామివారి ధనుర్మాసోత్సవాల సందర్భంగా ముద్రించిన ఆహ్వాన పత్రికను మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు అధిక సంఖ్యలో ధనుర్మాసోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. స్వామివారి సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించడం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ రాజమణి, నాయకులు కానుగు భూపతి రాజు, మాయ మల్లేశం, ఆలయ కమిటీ అధ్యక్షుడు కంచి మధుసూదన్, కమిటీ సభ్యుడు నాగరాజు, పలువురు భక్తులు పాల్గొన్నారు.

Related News

Latest News