ప్రతిపక్షం, జూలై 01: ‘ది అండర్ 18 వరల్డ్’ పిల్లలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన చిట్‌చాట్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో పిల్లలు అడిగిన ప్రశ్నలకు సరదాగా స్పందించిన కేటీఆర్, హీరో ప్రభాస్‌కు ఫోన్ చేసి మాట్లాడటం ఆకట్టుకుంది.
అలాగే పిల్లలు అడిగిన ఫన్నీ ప్రశ్నలకు నవ్వుతూ సమాధానాలు ఇచ్చిన కేటీఆర్, ఓ చిన్నారితో కలిసి పుష్‌అప్స్ కూడా చేశారు. ఇదే సమయంలో ఆయన సతీమణి నుంచి ఫోన్ రావడంతో “తర్వాత మాట్లాడతా” అంటూ కాల్ కట్ చేసిన దృశ్యాలు కూడా ప్రోమోలో కనిపించాయి. పూర్తి ఇంటర్వ్యూ వీడియో త్వరలో విడుదల కానుంది.
















