సంధ్య థియేటర్ కేసు నేడు విచారణ.. మరోసారి కోర్టు ముందుకు అల్లు అర్జున్

ప్రతిపక్షం, జూలై 06: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టులో నేడు కీలక విచారణ జరగనుంది. కమిటల్ బాండ్ ప్రక్రియలో భాగంగా కేసులో నిందితులుగా ఉన్న వారందరూ కోర్టుకు హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. గత విచారణలో ఇద్దరు నిందితులు గైర్హాజరు కావడంతో కోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది.

ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులు కోర్టు ఎదుట హాజరైన తర్వాతే తదుపరి న్యాయపరమైన ప్రక్రియ కొనసాగనుంది. ప్రస్తుతం ముంబైలో ఉన్న హీరో అల్లు అర్జున్ వ్యక్తిగతంగా కాకుండా వర్చువల్‌ విధానంలో విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. నేటి విచారణలో కోర్టు తీసుకునే నిర్ణయాలపై సినీ, న్యాయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Spread the love

Related News

Latest News