Trending Now

మనోడు.. మొనగాడే..!

3 నెలల్లో 137 కొట్ల నిధులు..

షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్‌పై మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ప్రశంసలు

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే షాద్ నగర్ నియోజక వర్గానికి 137 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులను తెచ్చిన ‘మనోడు మొనగాడే’నని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను ఉద్దేశించి స్ధానిక మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సోమవారం పట్టనంలోని ఈడెన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. వంశీ చంద్ రెడ్డి గెలుపు కోసం కార్యకర్తలు అహర్నిశలు శ్రమించాలన్నారు. పార్లమెంటు, అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఉంటేనే అభివృద్ధి పెద్ద ఎత్తున జరగడానికి ఆస్కారం ఉంటుందని పార్లమెంటులో వంశి చంద్ రెడ్డి, స్థానిక అసెంబ్లీలో వీర్లపల్లి శంకర్ మంచి జోడి ఉంటుందని అన్నారు.

Spread the love

Related News