ప్రతిపక్షం, జూన్ 10: తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కార్యకర్తల్లో ఉత్సాహం నింపడంతో పాటు ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఈ యాత్రను నిర్వహించనున్నట్లు సమాచారం. మరోవైపు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా పాదయాత్ర చేపట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తండ్రీకొడుకులు ఒకేసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది.

















