మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రితో టీపీసీసీ చీఫ్ చర్చలు

ప్రతిపక్షం, జూన్ 09: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్తో కీలక సమావేశం నిర్వహించారు.

రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి ఎన్నికను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధిష్ఠానం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికల వ్యూహం, ఎమ్మెల్యేల సమీకరణ, పార్టీ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

గత మూడు రోజులుగా మధ్యప్రదేశ్‌లోనే మకాం వేసిన మహేష్ కుమార్ గౌడ్, పార్టీ నేతలు, శ్రేణులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల నిర్వహణపై దృష్టి సారిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి అవసరమైన అన్ని చర్యలను పార్టీ వేగవంతం చేసినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

Spread the love

Related News

Latest News