హరీశ్ కేసీఆర్ తయారుచేసిన సైనికుడు.. రేవంత్ ఆరోపణలు నిరాధారం: కేటీఆర్

ప్రతిపక్షం, జూలై 11: మాజీ మంత్రి హరీశ్ రావు బీజేపీలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నారన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. హరీశ్ రావు కేసీఆర్ తీర్చిదిద్దిన సైనికుడని, ఆయనపై ఇలాంటి ఆరోపణలు గతంలోనూ ఎన్నోసార్లు వచ్చాయని, వాటికి ఇప్పటికే పలుమార్లు స్పష్టత ఇచ్చారని అన్నారు. నాలుగు పార్టీలు మారిన రాజకీయ చరిత్ర రేవంత్ రెడ్డిదేనని విమర్శిస్తూ, ఆయనకే రాజకీయ శీలపరీక్ష అవసరమని వ్యాఖ్యానించారు. కాగా, సీఎం ఆరోపణలకు మాజీ మంత్రి హరీశ్ రావు కూడా ఇప్పటికే ఘాటుగా సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే.

Spread the love

Related News

Latest News