ఉద్యమకారులందరికీ న్యాయం.. గుర్తింపు, గౌరవమే లక్ష్యం: కేశవరావు

ప్రతిపక్షం, జూన్ 04: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారుడికి న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేశవరావు తెలిపారు. ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఆధ్వర్యంలో సచివాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించినట్లు వెల్లడించారు.

ఉద్యమకారుల సంక్షేమం, సమస్యల పరిష్కారంపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను స్వీకరించినట్లు చెప్పారు. విద్యార్థి సంఘాలు, ఉద్యమకారుల సంఘాల ప్రతినిధులతో మరోసారి సమావేశమై సూచనలు తీసుకుంటామని పేర్కొన్నారు.

తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమాల్లో పాల్గొన్న వారందరికీ సముచిత గుర్తింపు, గౌరవం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కేశవరావు స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News