అల్లోలను విభేదిస్తున్న స్థానిక నేతలు!!
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి,నిర్మల్ డిసిసి అధ్యక్షుడు లేకుండానే నిర్మల్ లో అల్లోల వర్గీయుల కాంగ్రెస్ చేరిక!
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 3 : రెండున్నర నెలలుగా ఉత్కంఠ భారీతంగా మారిన రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికకు గురువారంతో తెరపడింది. అయితే డీసీసీ అధ్యక్షుడితో పాటు స్థానిక నేతలు చాలా మంది అల్లోల వర్గం పార్టీలో చేరడాన్ని విభేదిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం నిర్మల్ లో అల్లోల వర్గీయుల కాంగ్రెస్ లో చేరిక కార్యక్రమాన్ని నిర్మల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీగా అలోల్ల అభిమానులు అనుచరులు తరలిరాగా నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీ హరిరావు, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. వారితో పాటు ఇటీవల కాంగ్రెస్ లో చేరిన నిర్మల్ మున్సిపల్ చైర్మన్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆయా స్థాయి ప్రజాప్రతినిలు మాజీ ప్రజా ప్రతినిధులు హాజరు కాలేదు. కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి సీతక్క, పార్లమెంట్ ఎన్నికల కోఆర్డినేటర్ శ్రావణ్ కుమార్ రెడ్డి సాక్షిగా నిర్మల్ కాంగ్రెస్ వర్గ విభేదాలు బయటపడ్డాయి. అంత ఆర్భాటంగా జరిగిన కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు, స్థానిక నేతలకు అల్లోల వర్గం నుండి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది.