ప్రతిపక్షం, హైదరాబాద్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈ వేకువ జామున ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో మరణించారు. సదాశివపేటకు వెళుతుండగా పఠాన్ చెరు వద్ద కారు డివైడర్ ను ఢీకొంది. తండ్రి సాయన్న గత ఏడాది ఇదో నెలలో చనిపోయారు. శాసనసభకు అయిదుసార్లు ప్రాతినిధ్యం వహించిన ఆయన మృతితో వారసురాలిగా లాస్య శాసనసభకు ఎన్నికయ్యారు. తండ్రి ఉండగానే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు.ఇక లాస్యను దురదృష్టం వెంటాడుతోందనే గత సంఘటలను చెబుతున్నాయి. ఒకసారి లిఫ్ట్ల లో చిక్కుకున్నారు. ఇటీవలి నల్గొండ బీఆర్ఎస్ సభకు వెళ్లి వస్తుండగా ఆమె కారు డీకొని హోంగార్డు మరణించిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో లాస్య తీవ్రంగా గాయపడ్డారు. అప్పుడు చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారకరామారావు ‘ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి’ అని సూచించారు. అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదనికి కారణమని పోలీసలు ప్రాథమిక విచారణలో తేలింది.