ప్రతిపక్షం, కరీంనగర్ ఏప్రిల్ 06 : కేసీఆర్ పంటల పరిశీలన బండెడు ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్ళినట్టుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని.. పద్ధతి మార్చుకోకపోతే కరీంనగర్ నుండే తరిమి కొట్టడం ప్రారంభిస్తామని నరేందర్ రెడ్డి హెచ్చరించారు.
అవినీతికి పాల్పడి రైతుల కోసం మొసలి కన్నీరు కార్చుతున్నారన్నారు. అంత పెద్ద ప్రాజెక్టు కుంగి పోతే ఇసుక బస్తాలు వేస్తే ఆగుతుందని అనడం కేసీఆర్ ఎంత అవివేకో అర్థమౌతుందని నరేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ విలేఖరుల సమావేశంలో చర్ల పద్మ, నాయకులు శ్రావణ్ నాయక్, కొరివి అరుణ్ కుమార్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, సలీముద్దీన్, దన్ను సింగ్, దండి రవీందర్, అబ్దుల్ బారి, జనగామ శరత్ రావు, ఎండి చాంద్, కుర్రపోచయ్య, వంగల విద్యాసాగర్ ,నెల్లి నరేష్, పోరండ్ల రమేష్, కుంభాల రాజకుమార్, లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు.