ప్రతిపక్షం, వెబ్ డెస్క్: రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను వైసీపీ నాయకత్వం విడతల వారీగా ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అంతకు ముందు ప్రకటించిన అభ్యర్థులను కూడా మార్చేస్తున్నారు. తాజాగా నిన్న రాత్రి వైసీపీ 12వ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కేవలం ఇద్దరు అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు. చిలకలూరిపేట ఇన్ఛార్జీగా కావటి మనోహర్ నాయుడు, గాజువాక ఇన్ఛార్జీగా గుడివాడ అమర్ నాథ్ పేరును ప్రకటించారు. మరోవైపు కర్నూలు మేయర్ గా బీసీ వర్గానికి చెందిన సి.సత్యనారాయణమ్మను నియమించినట్టు వైసీపీ ప్రకటించింది. ప్రస్తుతం ఆమె కర్నూలు 25వ వార్డు కార్పొరేటర్ గా ఉన్నారు.