Trending Now

మోడీ అరచేతిలో వైకుంఠం చూపించి వెళ్లిపోయారు..

కరీంనగర్ బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్

ప్రతిపక్షం, హుస్నాబాద్, మే 9: వేములవాడకు వచ్చిన మోడీ.. 500 కోట్ల నిధులు ఇవ్వమంటే అరచేతిలో వైకుంఠం చూపించి వెళ్లిపోయారని కరీంనగర్ బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కోహెడ మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడకు నిధులు ఎందుకు ఇవ్వలేదు చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ పార్టీ, మోడీ దేవుళ్ళ పేరుతో రాజకీయం చేయడం తప్ప దేవాలయలకు చిల్లి గవ్వ కూడా ఇవ్వరని అన్నారు. బండి సంజయ్ ఐదు ఏళ్లలో ఒక గుడికి ఒక బడికి అయినా నిధులు తెచ్చాడా అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు తెస్తామంటే కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు మోసపోయారని.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మోసపోవద్దని ప్రజలను కోరారు. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంటు వచ్చేదని ఇప్పుడు కరెంటు పోయి కోతులు వస్తున్నాయని అన్నారు.

గ్రామాల్లో వడ్లు కొనడం లేదు, రైతులకు బోనస్ ఇవ్వడం లేదని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేసీఆర్ కిట్టు బంద్ అయిందని కల్యాణ లక్ష్మి పథకం ఎత్తేశారని కాంగ్రెస్ ఇస్తామన్న తులం బంగారం ఎటుపోయాయని ప్రశ్నించారు. నన్ను గెలిపిస్తే కరీంనగర్ కి స్కిల్ డెవలప్మెంట్ తీసుకువస్తానని అన్నారు. కరీంనగర్ మనోహరాబాద్ రైల్వే లైన్ నేనే తెచ్చానని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి కరీంనగర్ తో పాటు 12 పార్లమెంట్ స్థానాల్లో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు ఎంపీపీ కీర్తి సురేష్, వైస్ ఎంపీపీ రాజిరెడ్డి, రాష్ట్ర సీనియర్ నాయకులు కర్ర శ్రీహరి, పీఎసీఎస్ చైర్మన్ దేవేందర్ రావు, రవీందర్ రావు శంకర్, మునిధర్ రెడ్డి, ఆవుల మహేందర్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News