Trending Now

కార్నర్ మీటింగ్‌ని విజయవంతం చేయండి..

టీపీసీసీ స్టేట్ సెక్రటరీ గాడిపల్లి శ్రీనివాస్ రెడ్డి..

ప్రతిపక్షం, సిద్దిపేట, మే 01: సిద్ధిపేట పట్టణంలో మే నెల 2న జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో, కార్నర్ మీటింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ టీపీసీసీ సెక్రటరీ గాడిపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి జిల్లా కేంద్రానికి వస్తున్న సందర్బంగా జిల్లాలోని నాయకులు కార్యకర్తలు తరలిరావాలని ఆయన కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాంగంగా మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధును గెలిపించాలని సిద్ధిపేట పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉందని అన్నారు. సిద్ధిపేట నియోజవర్గం నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సిద్ధిపేట కార్నర్ మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రజలకు శుభ సందేశం ఇవ్వనున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో ఐదు గ్యారంటీ పథకాలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెల్లిందని అన్నారు.

పదేళ్లు కేంద్రంలో ఉన్న బీజేపీ ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయలేదని అన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని మతం పేరిట వస్తున్న బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. మిగులు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కోపంగా మార్చిన బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు తోడుదొంగలని ఆ పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. దేశ ప్రజలంతా కాంగ్రెస్ వైపు ఉన్నారని పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం రావడం ఖాయమని అన్నారు. కవిత జైలు నుంచి విడుదల చేయించేందుకే బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కు అయిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేంద్రంలో అధికారంలోకి వస్తుందా అని అన్నారు. గెలిచిన ఎంపీ సీట్లను మోది కాళ్ళ కింద బేరం పెట్టి కవితను జైలు నుంచి విడిపించేందుకే కేసీఆర్ కుట్ర పడుతున్నారని అన్నారు. రైతులు పేదల కడుపు కొట్టిన వెంకటరామిరెడ్డికి ఓట్లు అడిగే కనీస అర్హత లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బాల్ రెడ్డి, చందు, హుస్సేన్, దిలీప్ కుమార్, వెంకట్, వీరా రెడ్డి, ప్రకాష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News