104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా: ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

ప్రతిపక్షం, సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 09: 104 సర్వీసెస్ ఉద్యోగులు సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో 104 సర్వీసెస్ ఉద్యోగులు మంగళవారం ఎమ్మెల్సీని కలిసి వారి సమస్యలపై వినతి పత్రం అందించారు. ఉద్యోగ భద్రత, వేతనాలు మరియు ఇతర దీర్ఘకాలిక సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని వారు కోరారు. దీనిపై ఎమ్మెల్సీ డా. అంజిరెడ్డి సానుకూలంగా స్పందిస్తూ… ప్రజలకు అత్యవసర ఆరోగ్య సేవలు అందిస్తున్న 104 ఉద్యోగుల సమస్యలు న్యాయమైనవని పేర్కొన్నారు. డీఎంఈ పరిధిలో పని చేస్తున్న 104 ల్యాబ్ టెక్నీషియన్, పార్మాసిస్ట్ లకు 14 నెలలుగా జీతాలు అందడం లేదన్నారు. ఈ విషయాలను ఖచ్చితంగా సీఎం, సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 104 ఉద్యోగుల సంఘం ప్రతినిధులు శివరాజ్, వెంకట్ రెడ్డి, కల్పన, వినోద, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News