అదనపు ధాన్యం కొనుగోలుపై కేంద్రానికి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు

ప్రతిపక్షం, జూలై 22: తెలంగాణ నుంచి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం పట్ల కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ నెల 8న కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి తెలంగాణ నుంచి ధాన్యం సేకరణను పెంచాలని విజ్ఞప్తి చేశామని, ఆ అభ్యర్థనపై కేంద్రం సానుకూలంగా స్పందించి అదనపు కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రైతులకు ఊరటనిచ్చే నిర్ణయమని పేర్కొన్నారు.

రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం కల్పించిన ఈ అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. అదనపు ధాన్యం కొనుగోలు వల్ల రాష్ట్ర రైతులకు పంట విక్రయంలో మరింత వెసులుబాటు లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Spread the love

Related News

Latest News