‘పొలిమేర-3’లో యాక్షన్ కింగ్ అర్జున్.. కీలక పాత్రలో నటించనున్నారా?

ప్రతిపక్షం, జూలై 19: సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘పొలిమేర’ ఫ్రాంచైజీ మూడో భాగంపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ‘పొలిమేర-3’ను ప్రకటించి రెండేళ్లు దాటినా ఇప్పటివరకు చిత్రీకరణ ప్రారంభం కాలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అయితే ఆయన పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఈ సినిమాకు అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ‘పొలిమేర’ ఫ్రాంచైజీలోని తొలి రెండు చిత్రాలు సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సత్యం రాజేశ్, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య తదితరులు ఈ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పుడు మూడో భాగంలో అర్జున్ చేరనున్నారనే వార్తతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అధికారిక ప్రకటన వెలువడితే ఈ వార్తపై స్పష్టత రానుంది.

Spread the love

Related News

Latest News