ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ BJP, BRS కలిసి ఆడుతున్న నాటకమని సీఎం రేవంత్ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బ తీసేందుకు ఈ డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. ‘కవిత అరెస్టును కేసీఆర్ ఖండించలేదు. PM మోదీ కూడా దీనిపై ఏం మాట్లాడట్లేదు. వారిద్దరి మౌనం వెనుక ఏదో వ్యూహం ఉంది. ఓట్ల కోసమే ఇలా చేస్తున్నారు. గతంలో ఈడీ వచ్చాక మోదీ వచ్చేవారు. నిన్న మాత్రం మోదీ, ఈడీ కలిసే వచ్చారు’ అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.