సంఘ పరివార్‌పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలి.

*దేశం కోసం పనిచేసే కార్యకర్తల త్యాగాలను అవమానించే హక్కు ఎవరికీ లేదు – BJYM

ప్రతి పక్షం చండూరు సెప్టెంబర్ 27 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంఘ పరివార్‌పై చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా రాష్ట్ర నాయకులు శ్రీపిన్నింటి నరేందర్ రెడ్డి పత్రిక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.శుక్రవారం రోజు రాత్రి కేరళలో జరిగిన కార్యక్రమంలో గాంధీ పరివార్–సంఘ పరివార్ మధ్య పోరాటంగా రాజకీయ పరిస్థితిని అభివర్ణిస్తూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ విమర్శల స్థాయిని దాటి,దేశం కోసం పనిచేస్తున్న లక్షలాది మంది కార్యకర్తల భావజాలాన్ని కించపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు.సంఘ పరివార్ అంటే ఒక కుటుంబం కాదు.. దేశభక్తి,సేవ,క్రమశిక్షణ, సమాజ నిర్మాణం కోసం పనిచేసే అనేక సంస్థలు మరియు లక్షలాది మంది కార్యకర్తల సమూహం. దేశమే ప్రథమం అనే భావనతో వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి సమాజం కోసం పనిచేస్తున్న కార్యకర్తల త్యాగాలను రాజకీయ ప్రయోజనాల కోసం తక్కువ చేసి మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయికి తగదు.అధికారం అనేది ఏ ఒక్క కుటుంబానికి శాశ్వత వారసత్వం కాదని,భారత ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు అని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి.

ఒక కుటుంబం చుట్టూ రాజకీయాలను కేంద్రీకరించడం కంటే,తెలంగాణ ప్రజల సమస్యలు,యువత భవిష్యత్తు,రైతుల సంక్షేమం, ఉద్యోగాలు,అభివృద్ధిపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని సూచించారు.దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయులను ప్రతి ఒక్కరూ గౌరవించాలి.అదే సమయంలో దేశం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న సామాన్య కార్యకర్తల సేవలను కూడా గౌరవించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉంది.సంఘ పరివార్‌పై రాజకీయ విమర్శలు చేయాలనుకుంటే విధానాలపై,సిద్ధాంతాలపై ఆరోగ్యకరమైన చర్చకు రావాలని కానీ లక్షలాది మంది కార్యకర్తల త్యాగాలను కించపరిచే వ్యాఖ్యలు చేయడం సముచితం కాదని అన్నారు.“కుటుంబం కోసం కాదు,దేశం కోసం” అనే స్ఫూర్తితో పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.ముఖ్యమంత్రి హోదా రాజ్యాంగబద్ధమైన బాధ్యతతో కూడుకున్నదని,ఆ హోదాకు తగిన భాషను ఉపయోగించాలని సూచించారు.సంఘ పరివార్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని,దేశం కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Spread the love

Related News

Latest News