-నల్లగొండ పట్టణంలో ఈనెల 15 నుంచి 18 వరకు మహాసభలు.
-భారత రైతాంగానికి గిట్టుబాటు ధర లేక కల్పించాలి.
-సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
ప్రతిపక్షం, కొమురవెల్లి, నవంబర్ 10: నల్లగొండ పట్టణంలో జరిగే అఖిలభారత కిసాన్ 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు అన్నారు. మంగళవారం కొమురవెల్లిలో 36వ మహాసభలను విజయవంతం చేయడానికి మద్దతుగా రైతు సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వేలాది మందితో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్క రాములు, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆముదాల మల్లారెడ్డితో కలిసి మాట్లాడుతూ అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలు ఈనెల 15 నుండి 18 వరకు నల్గొండలో జరుగుతాయని, దేశవ్యాప్తంగా రైతు సమస్యలపై పోరాడుతున్న 1000 మందికి పైగా ప్రతినిధులు లక్షలాదిమంది రైతులు హాజరవుతారని తెలిపారు. మొదటిరోజు భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఈ సభకు అఖిలభారత నాయకులు కామ్రేడ్ బృందాకారత్ హాజరవుతారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 32 దేశాల వ్యవసాయ ఉత్పత్తులను మనదేశంలో కి దిగుమతి కి అనుమతించడంతో మన దేశ రైతాంగం భారీగా నష్టపోవాల్సి ఉంటుందని తెలిపారు.
ఇప్పటికే పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, దేశంలో రైతు ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయని, వీటిని నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల పేరిట మోడీ ప్రభుత్వం పూర్తిగా అమెరికాకు లొంగిపోయిందని ఇప్పటికే అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్ దేశాలతోటి ఈ ఒప్పందాలు చేసుకుందని దీంతో మన దేశ పాడి, పౌల్ట్రీ పరిశ్రమకు పెను ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. విద్యుత్ సవరణ బిల్లు 2025, విత్తన చట్టం సవరణ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టారని, ఈ రెండు చట్టాలు అమలు అయితే భారతదేశ రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం పూర్తిగా ప్రైవేటు రంగం చేతిలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు వ్యవసాయంలో కార్పొరేట్ రంగాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ మన రైతుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కోసం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు ఈ అఖిల భారత రైతు సంఘం మహాసభలలో పై సమస్యలపై చర్చించి తీర్మానాలు చేసి భారత రైతాంగాన్ని ఆదుకోవడానికి రైతు మహాసభలు దోహదపడతాయి అన్నారు ఈ మహాసభలను విజయవంతం చేయడానికి ఈనెల 15 న రైతాంగం పెద్ద ఎత్తున నల్గొండకు కదిలి రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట్ మావో సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సందబోయిన ఎల్లయ్య కాముని గోపాలస్వామి జిల్లా ఉపాధ్యక్షులు శెట్టిపల్లి సత్తిరెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తాడూరి రవీందర్ రాళ్ల బండి శశిధర్ రైతు సంఘం రాష్ట్ర కమిటి సభ్యురాలు నక్కల లావణ్య మహిళా సంఘం జిల్లా కార్యదర్శి అత్తిని శారద రైతు సంఘం జిల్లా నాయకులు బద్దిపడగ కృష్ణారెడ్డి రవికుమార్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ చుంచనకోట సర్పంచ్ గొర్రె శ్రీనివాస్ కెవిపిఎస్ నాయకులు బక్కిలి బాలకిషన్ ఎస్ఎఫ్ఐ నాయకులు ఆముదాల రంజిత్ రెడ్డి అభిషేక్ భాను నీల బిక్షపతి మల్లం అంజయ్య బోడిగం సురేందర్ రెడ్డి తాడూరు మల్లేశం కర్రోళ్ల ఎల్లయ్య దాసరి మహేష్ నరసవ్వ పాకినాటి బాలు తదితరులు పాల్గొన్నారు.



























