. మొల్లమాంబకు దక్కనున్న సముచిత గౌరవం.
. ఏళ్ల నిరీక్షణకు తెర.. మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం.
. ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డికి కుమ్మరి సంఘం కృతజ్ఞతలు.. త్వరలో భూమిపూజ.
వనపర్తి ప్రతినిధి, అక్టోబర్ 09, ప్రతిపక్షం: ఏళ్లుగా ఎదురుచూస్తున్న కవిత్రి మొల్లమాంబ విగ్రహ ప్రతిష్ఠకు ఎట్టకేలకు అడుగు ముందుకు పడింది.వనపర్తి జిల్లా కేంద్రంలో మొల్లమాంబ విగ్రహం ఏర్పాటు చేయాలన్న ఆకాంక్షకు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానంతో మార్గం సుగమమైంది. ఇన్నాళ్ల నిరీక్షణకు తెరదించి, విగ్రహ ప్రతిష్ఠకు చొరవ చూపిన ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన వనపర్తి జిల్లా కుమ్మరి(శాలివాహన) సమాజం.
మాటలు కాదు.. చేతల్లో చొరవ చూపిన ఎమ్మెల్యే.
మహనీయుల సేవలను స్మరించుకోవడం కేవలం వేడుకలకే పరిమితం కాకూడదని, వారి ఆశయాలకు తగిన గౌరవం కల్పించాలని సంకల్పంతో సెప్టెంబర్ 30న కుమ్మరి సంఘం అధ్వర్యంలో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి సహకారంతో, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు సెప్టెంబర్ 30న తీర్మానం చేయడంతో మొల్లమాంబ విగ్రహ ప్రతిష్ఠకు రూపం దాల్చింది. మొల్లమాంబ విగ్రహ ప్రతిష్టపన కోసం శాలివాహనుల ఏళ్ల నిరీక్షణను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధు గౌడ్, సహకరించిన కౌన్సిలర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
నిరీక్షణకు ముగింపు.. భూమిపూజకు సన్నాహాలు!
విగ్రహ ప్రతిష్ఠకు తీర్మానం జరగడం తొలి అడుగు మాత్రమేనని, తదుపరి పనులు కూడా వేగంగా పూర్తిచేసి విగ్రహ ప్రతిష్ఠ కలను సాకారం చేయాలని శాలివాహనుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి స్పందించి త్వరలోనే భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.మొల్లమాంబకు దక్కాల్సిన గౌరవం కార్యరూపం దాల్చి ప్రయత్నానికి సంపూర్ణ సార్థకత చేకూరడంతో శాలివాహనులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ బొడ్డుపల్లి పరశురాం ఆధ్వర్యంలో శాలివాహనులు ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకుడు బొడ్డుపల్లి నరసింహ, వనపర్తి టౌన్ అధ్యక్షులు బొడ్డుపల్లి వెంకటేష్, వనపర్తి టౌన్ గౌరవ అధ్యక్షులు మన్నెంకొండ, బొడ్డుపల్లి మన్యం బొడ్డుపల్లి వెంకటయ్య, బొడ్డుపల్లి లక్ష్మణ్, బొడ్డుపల్లి రవి,యువకులు గుణగంటి లక్ష్మీనారాయణ,గుణగంటి అంజి, సూర్యవంశం శివ,సతీష్,చిన్నరమేష్,శ్రీ రాజు,గుణగంటి పవన్, నాగపూర్ అంజి,గుణగంటి లోకేష్, గుణగంటి యాదగిరి, యువకులు పాల్గొన్నారు.




























