విద్య, సేవారంగాల్లో విశేష కృషికి ఢిల్లీలో జాతీయ పురస్కారం అందుకున్న ఏ.వి. బాలేశం

ప్రతి పక్షం, దుబ్బాక, నవంబర్ 19: సిద్దిపేట జిల్లాకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచార పరిషత్ కార్యకర్త, వయోవృద్ధుల సేవా సంఘం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు ఏ.వి. బాలేశం విద్యారంగం, ఆధ్యాత్మిక సేవ, సామాజిక సంక్షేమం, వయోవృద్ధుల హక్కుల పరిరక్షణకు అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఢిల్లీలో జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు.నవంబర్ 15న ఢిల్లీలో నిర్వహించిన జాతీయ పురస్కార ప్రదానోత్సవంలో భారత ప్రభుత్వ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ కమిషనర్ సుధారాణి రేలంగి, కరోల్ బాగ్ ఎమ్మెల్యే రవి, బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ ప్రముఖుల చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు.తాజాగా ఢిల్లీలో జాతీయ స్థాయి పురస్కారం అందుకోవడం పట్ల సిద్దిపేట జిల్లా గ్రామం దుంపల పల్లి కు చెందిన పలువురు ఉపాధ్యాయులు, సేవా సంస్థల ప్రతినిధులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.

Related News

Latest News