కన్నెపల్లి పర్యటనపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్

ప్రతిపక్షం, జూలై 06: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంపుహౌస్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ పర్యటన ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ లబ్ధి కోసమేనని ఆయన విమర్శించారు.

కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి రైతులకు అందించాలని కేటీఆర్ డిమాండ్ చేయడంపై స్పందించిన మంత్రి, ప్రభుత్వం అన్ని నిర్ణయాలను నిపుణుల సలహాలు, సాంకేతిక నివేదికల ఆధారంగానే తీసుకుంటోందని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్లు కాకుండా జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ సూచనలు, నిబంధనలను పూర్తిగా పాటిస్తూ మాత్రమే ప్రభుత్వం ముందుకు సాగుతుందని శ్రీధర్ బాబు తెలిపారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ శాస్త్రీయ విధానంలోనే నిర్ణయాలు అమలు చేస్తున్నామని చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాజకీయ ఆరోపణలు చేయడం కంటే ప్రజల భద్రత, ప్రాజెక్టు స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వ్యవహరిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News