Trending Now

రుణ మాఫీ రెండు నెలల లోపు అందిస్తాం..

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ప్రతిపక్షం, ప్రతినిధి హనుమకొండ, జులై 2: రైతులకు రుణమాఫీ రెండు నెలల లోపు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం మంత్రి డోర్నకల్ మండలం చాప్లా తండా గ్రామంలోని సీతారామ ప్రాజెక్ట్ కాల్వ పనులను ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రు నాయక్, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రాం నాథ్ కేకన్ తో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టు డిజైన్ ను మ్యాప్ ద్వారా ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్టు పనులు, కొనసాగుతున్న కెనాల్స్ పనులు, భూ సేకరణ, ప్రాజెక్టు పూర్తి కావడానికి కావలసిన నిధులు, ఎదురవుతున్న సమస్యలను ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు మంత్రులకు వివరించారు. ఈ ప్రాజెక్టు సందర్శన లో బాగంగా మీడియా తో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులకు 2 లక్షల రుణ మాఫీ ను రెండు నెలల లోపు అందిస్తామన్నారు. ఈ ప్రభుత్వంలో విద్యకు పెద్ద పీట వేస్తున్నాం. పెద్దవాళ్ళకి వైద్యం చేసే కార్యక్రమాన్ని ఆరు గ్యారంటీ లలో బాగంగా పెదోళ్ళకి అండగా ఉంటాం అన్నారు.

ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం వచ్చి 90 రోజులలో సుమారు 30 వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే మహబూబాబాద్ జిల్లా సస్యశ్యామ అవుతుందని ఆశ బాగుంది వ్యక్తం చేశారు. సీతారామ ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్షించారు. అనంతరం తోడేళ్ళ గూడెం లోని సీతారామ ప్రాజెక్ట్ పాలేరు లింక్ కెనాల్ పనులను పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రణాళిక బద్దంగా పనులు చేపట్టకపోవడం వలన సాగునీటి సరఫరా జరిగే పరిస్తితి లేదన్నారు.ఆగస్టు వరకు ఖమ్మం జిల్లాలో రెండు మైనర్ ప్రాజెక్టు లకుగోదావరి నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నట్లుగా వివరించారు.

ముఖ్యమంత్రి రైతాంగానికి సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు.సీతారామ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నీటిని ఈ ప్రాంతానికి తీసుకురావడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాకు నీరు అందించేందుకు ఈనాడు ప్రాజెక్ట్ను పూర్తి చేసే దిశలో కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. మొదటి లిఫ్ట్ లో కూడా వెట్ రన్ నాలుగు రోజుల క్రితం ట్రయల్ వేయడం జరిగిందని, పాలేరు దాకా నీళ్ళు రావాలి అంటే మద్యలో కొన్ని ప్రాంతాలలో పెండింగ్ లో ఉన్న టెండర్ల ను యుద్దప్రాతిపదికన ఫైనల్ చేయాలని అన్నారు.

ఆగష్టు 15 లోపు నాగార్జున సాగర్ ఆయకట్టులో సూమారు ఒక లక్షా యాబై అయిదు వేల ఎకరాలని, మీడియం ప్రాజెక్ట్ లైన వైరా,లంకా సాగర్ రెండు ప్రాజెక్ట్ పరిదిలో ఉన్న ఆయకట్టుతో పాటు మైనర్ ఇరిగేషన్ లో ఉన్న ఆయకట్టు చెరువులను కూడా లింక్ కెనాల్ ను అనుసంధానం చేసి రైతులకు రెండు పంటలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ పర్యటనలో మంత్రి వెంట రెవెన్యు అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, మహబూబాబాద్ ఆర్డీవో ఎల్. అలివేలు, అదనపు ఎస్పీ తిరుపతి రావు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిదులు తదితరులు పాల్గొనారు.

Spread the love

Related News

Latest News