బడి బాట సమర్ధవంతంగా నిర్వహించాలి

  • ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలి.
  • జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్.

ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్, జూన్ 04: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు ఆదేశించారు.గురువారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్లో విద్యాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరం మెరుగైన విద్యా ప్రమాణాల లక్ష్యంగా ముందుకు పోతూ బడి బాట సమర్ధవంతంగా నిర్వహించాలని,విద్యార్థుల తక్కువ నమోదు పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థుల నమోదు పెంచుటకై గ్రామంలోని ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలని, కనీస సామర్ధ్యాలు అయినటువంటి చదవడం రాయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పాఠశాలల్లో ఏర్పాటు చేసే మౌలిక వసతుల గురించి తల్లిదండ్రులకు వివరించాలని, వీటి ఆధారంగానే పాఠశాలలకు ప్రగతి సూచికలు ఇవ్వబడతాయని ,రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రీ ప్రైమరీ పాఠశాలలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అలాగే ఎఫ్ఆర్ఎస్, ఇతర అంశాలపై దృష్టి పెట్టి సరియగు చర్యలు గైకొనాలని సూచించారు ,జిల్లాలోని భవిత కేంద్రాల బలోపేతానికి కృషి చేయాలని, కొత్త ప్రీ ప్రైమరీ విభాగాలను ప్రారంభించాలని, విద్యార్థుల సంఖ్యలేని పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని, పాఠ్యపుస్తకాల పంపిణీ చేయాలని, స్వయం సహాయక బృందాల చేత పిల్లలకు యూనిఫామ్ కుట్టించాలని, నూతన టెక్నాలజీ ఏఐ, డిజిటల్ తరగతులను నిర్వహించాలని, విద్యాశాఖ బలోపేతానికి ప్రత్యేక కార్యచరణ ప్రకారం ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాజు, చీఫ్ మానిటరింగ్ ఆఫీసర్ రాజు, ఏ ఎం ఓ సుదర్శన మూర్తి, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News