Megha Akash Wedding Photos: నటి మేఘా ఆకాశ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియుడు సాయి విష్ణుతో ఏడడుగులు వేశారు. ఆదివారం చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన వివాహ వేడుకకు ఇరు కుటుంబాల పెద్దలు, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, మేఘా ఆకాశ్ ‘లై’ మూవీతో పరిచయమైన ‘ఛల్ మోహన్ రంగా’, ‘పేట’, ‘కుట్టి స్టోరీ’, ‘రాధే’, ‘రాజ రాజ చోర’, ‘డియర్ మేఘా’ వంటి చిత్రాల్లో నటించారు.
అంతకుముందు, శనివారం సాయంత్రం వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు సీఎం స్టాలిన్ హాజరై నూతన వధూవరులను కలిసి విషెస్ చెప్పారు. రిసెప్షన్ ఫోటోలను సోషల్ మీడియాలో నటి మేఘా ఆకాశ్ షేర్ చేసింది. ఇందులో జీవితంలో తనకెంతా ఇష్టమైన అధ్యాయం ఇదేనని రొసుకొచ్చింది. కాగా, రాజకీయ కుటుంబానికి చెందిన సాయి విష్ణుతో గతకొంతకాలంగా ఆమె ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాలు వీరి ప్రేమను ఒప్పుకోవడంతో ఇష్టప్రకారం ఆగస్టులో నిశ్చితార్థం చేశారు.