ఫామ్‌హౌస్‌లలో నేరాల నివారణ, సందర్శకుల భద్రత, చట్టబద్ధ నిర్వహణకు పలు కీలక మార్గదర్శకాలు జారీ
ప్రతిపక్షం, జూలై 04: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వుడ్‌ల్యాండ్స్ రిసార్ట్స్‌లో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి, ఐపీఎస్ అధ్యక్షతన చేవెళ్ల జోన్ పరిధిలోని మొయినాబాద్, షంషాబాద్, చేవెళ్ల, షాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న 750కు పైగా ఫామ్‌హౌస్‌లు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ల;యజమానులు, నిర్వాహకులతో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్స్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అవకాశం లేకుండా యజమానులు తప్పనిసరిగా పాటించాల్సిన భద్రతా ప్రమాణాలు, చట్టపరమైన నిబంధనలపై కమిషనర్ సమగ్రంగా వివరించారు.
కమిషనర్ సూచించిన ముఖ్య మార్గదర్శకాలు:
- సీసీటీవీ నిఘా తప్పనిసరి
ప్రతి ఫామ్‌హౌస్, రిసార్ట్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో నాణ్యమైన సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
సీసీటీవీ ఫుటేజ్‌ను కనీసం 30 రోజుల పాటు బ్యాకప్ రూపంలో భద్రపరచాలి.
పోలీసుల అవసరానికి అనుగుణంగా వెంటనే అందుబాటులో ఉంచాలి.
- అతిథుల నమోదు తప్పనిసరి
ప్రతి సందర్శకుడి పూర్తి వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలి.
ప్రతి అతిథి నుంచి ప్రభుత్వ గుర్తింపు పొందిన ఐడీ ప్రూఫ్ తప్పనిసరిగా సేకరించాలి.
ఆన్లైన్ గెస్ట్ రిజిస్ట్రేషన్ విధానాన్ని కూడా అమలు చేయాలి.
- ‘SAFE ATITHI’ యాప్ ప్రారంభం
అతిథుల వివరాలను సులభంగా నమోదు చేసేందుకు, భద్రతను మరింత బలోపేతం చేసేందుకు “SAFE ATITHI”(Digital Safety and Management Solutions) యాప్‌ను ఈ సందర్భంగా ప్రారంభించారు.
యజమానులు ఈ యాప్‌ను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు.
- మైనర్ల ప్రవేశంపై నిబంధనలు
తల్లిదండ్రులు లేకుండా మైనర్లకు ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్స్‌లో ప్రవేశం కల్పించరాదు.
మైనర్లు తప్పనిసరిగా తల్లిదండ్రులు లేదా చట్టబద్ధ సంరక్షకులతో కలిసి వచ్చినప్పుడే అనుమతించాలి.
- అనుమతులు తప్పనిసరి
ఫామ్‌హౌస్‌లలో నిర్వహించే కార్యక్రమాలకు అవసరమైన అన్ని చట్టబద్ధ అనుమతులు (లైసెన్సులు/పర్మిషన్లు) ముందుగానే పొందాలి.
- చట్టవిరుద్ధ కార్యకలాపాలకు కఠిన నిషేధం
క్రింది కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించరాదని స్పష్టం చేశారు:
. రేవ్ పార్టీలు
. డ్రగ్స్ పార్టీలు
. హుక్కా పార్టీలు
చట్టవిరుద్ధంగా నిర్వహించే బర్త్‌డే లేదా ఇతర వేడుకలు
. జూదం (గ్యాంబ్లింగ్)
మానవ అక్రమ రవాణాకు సంబంధించిన కార్యకలాపాలు
ఇతర చట్టవిరుద్ధ కార్యక్రమాలు
- ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయి
ఫామ్‌హౌస్‌లు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లలో నేరాల నివారణ కోసం ఈగిల్ ఫోర్స్ (EAGLE Force),యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (ANB), స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలు, సెక్టార్ ఎస్ఐలు తరచూ ఆకస్మిక తనిఖీలు *(Random Checking) నిర్వహిస్తారని తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కమిషనర్ పిలుపు
ఫామ్‌హౌస్‌లు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ల యజమానులు పోలీసు శాఖతో సమన్వయంతో పనిచేస్తూ, తమ ప్రాంగణాలను నేరరహితంగా, సురక్షితంగా నిర్వహించాలని, సందర్శకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్ డా. తరుణ్ జోషి, ఐపీఎస్ సూచించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులు
ఈ కార్యక్రమంలో చేవెళ్ల జోన్ డీసీపీ శ్రీ యోగేష్ గౌతమ్, ఐపీఎస్, చేవెళ్ల ఏసీపీ శ్రీ బి. కిషన్, మొయినాబాద్ ఎస్హెచ్ఓ శ్రీ మల్లికార్జున్ రెడ్డి, చేవెళ్ల ఎస్హెచ్ఓ శ్రీ భూపాల్ శ్రీధర్, షాబాద్ ఎస్హెచ్ఓ శ్రీ కాంతా రెడ్డి, షంషాబాద్ ఎస్హెచ్ఓ శ్రీ నరేందర్ రెడ్డి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, ఫామ్‌హౌస్ మరియు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ల యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


















