ప్రతిపక్షం, ఆగస్టు 04: పెళ్లి కోసం ఓ యువకుడు సోషల్ మీడియాలో పెట్టిన షరతులు తీవ్ర చర్చకు దారితీశాయి. కాబోయే భార్య తప్పనిసరిగా వర్జిన్‌గా ఉండాలని, ఎప్పుడూ మేకప్ వేసుకోకూడదని, 45 కిలోల బరువు, 5.2 అడుగుల ఎత్తు ఉండాలని తన పోస్టులో పేర్కొన్నాడు. అలాగే ఆమెకు గతంలో బాయ్‌ఫ్రెండ్స్ ఉండకూడదని, సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండాలని, తన మాటే వినాలని షరతులు విధించాడు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. భాగస్వామిని గౌరవించకుండా ఇలాంటి నియంత్రణాత్మక నిబంధనలు విధించడం సరైంది కాదని, పెళ్లి అనేది పరస్పర గౌరవం, నమ్మకం, అవగాహనపై నిలబడే బంధమని వ్యాఖ్యానిస్తున్నారు. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను కించపరిచేలా ఉన్న ఈ డిమాండ్లను పలువురు తీవ్రంగా విమర్శిస్తూ పోస్టులు చేస్తున్నారు.

















