Trending Now

Rohit: రోహిత్ శర్మ అరుదైన రికార్డు

Rohit Sharma is a rare record: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ఖాతాలో మరో అరుదైన రికార్డును వేసుకున్నారు. ప్రస్తుతం చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కలిపి మొత్తం 11 పరుగులే చేసినా ఓ రికార్డును మాత్రం సృష్టించారు. అత్యధిక వయసు కెప్టెన్‌గా ఉంటూ ఒకే క్యాలెండర్‌ సంవత్సరంలో వెయ్యికిపైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రోహిత్ నిలిచారు. 2024 క్యాలెండర్‌ ఇయర్‌లో మూడు ఫార్మాట్లలోనూ కలిపి రోహిత్ 27 మ్యాచుల్లో 1,001 పరుగులు చేశారు. ఇందులో మూడు వన్డేల్లో 157 పరుగులు, 11 టీ20ల్లో 378 పరుగులు, ఏడు టెస్టుల్లో 466 పరుగులు ఉన్నాయి. ప్రస్తుతం రోహిత్ వయసు 37 ఏళ్ల 144 రోజులు.

Spread the love

Related News

Latest News