ప్రతిపక్షం ప్రతినిధి, నకిరేకల్: చిట్యాల పట్టణంలోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మంగళవారం 21వ వార్షిక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. సుప్రభాతం, క్షీరాభిషేకం, గణపతి పూజ, దుర్గా హోమం, అమ్మవారికి వడి బియ్యం పోయుట వంటి కార్యక్రమాలు జరిగాయి. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి, చిన్న వెంకట్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్ దంపతులు హోమంలో పాల్గొన్నారు. సహకరించిన దాతలకు ఈ సందర్భంగా శాలువాలతో ఘనంగా సత్కరించారు. డైరెక్టర్లు బుద్ధ విమల కృష్ణమూర్తి, గంజి వెంకటేశం, వరకాంతం నర్సిరెడ్డి, రుద్రారపు లింగయ్య, జిట్ట సాయిలు, వనమా నిఖిల్ కుమార్, ఆలయ అధికారి అంబటి నాగిరెడ్డి తో పాటు కౌన్సిలర్లు, భక్తులు పాల్గొన్నారు.