ప్రతిపక్షం, వెబ్ డెస్క్: టెట్ ఫలితాల ప్రకటన, DSC-2024ను హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలని యోచిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. దీనిపై అనుమతి కోరుతూ ECకి లేఖ రాశామన్నారు. అనుమతిస్తే టెట్ ఫలితాలను ప్రకటించి, DSC హాల్ టికెట్లు విడుదల చేస్తామన్నారు. హైకోర్టు ఆదేశాలతో SGT పరీక్షలకు అనర్హులైన వారికి, ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి త్వరలోనే ఫీజులను తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు.