ప్రతిపక్షం, ఏపీ: రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మెరకు వైసీపీ అధిష్ఠానానికి లేఖను పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. టీటీడీ బోర్డు సభ్యురాలిగా ఉన్న ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. వీరిద్దరూ టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.