India C won by 4 wickets in Duleep Trophy: ఏపీలోని అనంతపురం వేదికగా ప్రారంభమైన దులీప్ ట్రోఫీలో ఇండియా ‘సి’ విజయం సాధించింది. ఇండియా ‘డి’తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా ‘సి’ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. 233 పరుగుల లక్ష్యంతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇండియా ‘సి’ పోరాడి గెలిచింది. కెప్టెన్ గైక్వాడ్(46), సుదర్శన్(22), ఆర్యన్(47), పటీదార్(44), పొరెల్(35), సుతర్(19) పరుగులతో రాణించగా.. షోకీన్(0), ఇంద్రజిత్(7) నిరాశ పరిచారు. ఇక, ఇండియా ‘డి’ బౌలర్లలో సరన్ష్ జైన్ 4 వికెట్లు తీయగా.. అర్షదీప్, అక్షర్ చెరో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా ‘డి’ 164 పరుగులు ఆలౌట్ అయింది. అక్షర్ పటేల్(86) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. తర్వాత ఇండియా ‘సి’ 168 పరుగులు చేసింది. ఇందులో ఇంద్రజిత్(72), అభిషేక్ పొరెల్(34) పరుగులు చేశారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా ‘డి’ 236 పరుగులు ఆలౌటైంది. ఇండియా ‘సి’ లెప్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ 7 వికెట్లు పడగొట్టాడు.