హిమాచల్‌లో విషాదం.. కొండచరియలు విరిగిపడి 13 మంది దుర్మరణం

ప్రతిపక్షం, జూలై 24: హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ సుమో వాహనంపై ఒక్కసారిగా భారీ కొండచరియలు విరిగిపడటంతో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రమాద సమయంలో వాహనంలో పలువురు ప్రయాణికులు ఉన్నారు. కొండచరియలు కూలిపడటంతో వాహనం పూర్తిగా శిథిలాల కింద చిక్కుకుంది. ఘటనలో ఇద్దరు ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు, రెస్క్యూ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాలను తొలగిస్తూ మృతదేహాలను వెలికితీసే పనులు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా, మృతుల వివరాలు, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కొండచరియలు విరిగిపడటంతో ఆ ప్రాంతంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం.

Spread the love

Related News

Latest News