Trending Now

వైభవంగా ఫాతిమా మాత మహోత్సవ వేడుకలు..

హాజరైన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: మతాలకతీతంగా ఉత్సవాలలో ప్రజలందరూ పాల్గొని ఉత్సవాలు విజయవంతం చేస్తారని అన్నారు పాతీమా మాత మేరీ చర్చి ఫాదర్. బుధవారం కొత్తూర్ మండల పరిధిలోని పాతీమా పూర్ గ్రామంలో మెరిమాత ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. ఇందులో భాగంగా ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. మేరీ మాత ఇక్కడ 75 సంవత్సరాల క్రితం వెలసిందని గుర్తు చేశారు. జీవితంలో మనకు అమ్మ పాత్ర ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసని దేవుడు కూడా మనకు ఒక తల్లిని ఇచ్చాడని, ఆమె మరియా మాత అన్నారు. ఆ మరియా మాతే ఫాతిమా మాతగా కొనియాడుతూ.. ప్రతిఏడాది ఈ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రత్యేకంగా కొనియాడే పండుగ ఫాతిమా మాత తిరునాళ్ల మహోత్సవ పండగ అని ఆ పండుగ వైభవంగా జరుగుతోందన్నారు. కుల, మత, జాతి భేదం లేకుండా దేవుని బిడ్డలుగా భరతమాత పుత్రులుగా శాంతి సామరస్యాలతో జీవించాలని ఆశీర్వచనాలు అందించారు.

Spread the love

Related News