రైతు ద్రోహిగా చరిత్రకు ఎక్కిన రేవంత్ రెడ్డి

•విదేశీ పర్యటన మోజులో పెద్ద జీతగాడు

•రైతు వ్యతిరేఖ విధానాలపై నిప్పులు చెరిగిన బిఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు. గట్టు యాదవ్, అధికార ప్రతినిధి.వాకిటి శ్రీధర్

ప్రతిపక్షం, జూన్ 20, వనపర్తి ప్రతినిధి: రైతు ద్రోహిగా రేవంత్ రెడ్డి చరిత్రకు ఎక్కారని…అబద్దపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టెంట ముంచిందని బిఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు. గట్టు యాదవ్, అధికార ప్రతినిధి. వాకిటి శ్రీధర్ లు అన్నారు. శనివారం మాజి మంత్రి. నిరంజన్ రెడ్డి స్వగృహంలో బిఆర్ఎస్ నాయకులు రైతు వ్యతిరేఖ విధానాలపై నిప్పులు చెరిగారు.ఈ సందర్బంగా మాజీ జిల్లా అధ్యక్షులు.గట్టు యాదవ్,అధికార ప్రతినిధి. వాకిటి.శ్రీధర్,మాజీ ఎంపిపికృష్ణా నాయక్ లు మాట్లాడుతూ… అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాలుగు సార్లు రైతు భరోసా ఎగ్గొట్టారని మండిపడ్డారు.మొత్తం సన్నాలకు బోనస్ అని చెప్పి విడతల వారిగా ఎగవేత చేశారని,ధాన్యం కొనుగోలులో విఫలం చెందారని విమర్శించారు.పాలమూరు రంగారెడ్డి కోసం కేవలం రూ.1000కోట్లు ఖర్చుపెట్టలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు.ధాన్యం కొనుగోలు నెపం కేంద్రంపై నెట్టివేసి రేవంత్ రెడ్డి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు.పెద్ద జీతగాడు విదేశీ పర్యటన మోజుగా పెట్టుకున్నాడని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు విషయములో ఒక్కనాడైనా ఎమ్మెల్యే సమీక్ష చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గ్రామాలలో తిరిగితే గుడ్డలు ఊడదీస్తారని,కేసీఆర్ ను మించి చేస్తానన్న సంక్షేమ పథకాలు అమలు చేసి హామీలు నిలబెట్టుకోవాలన్నారు.11విడతలుగా రూ.72లక్షల కోట్లు రైతు బంధు ఇచ్చి దేశానికి కెసిఆర్ ఆదర్శంగా నిలిచారని అన్నారు.యూరియా సరఫరా, రైతు భరోసా ఇవ్వకున్నా ఆరుగాలం శ్రమించి పంటలు పండించినా ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు మీద గోష్ కమిటీ వేసి కోoడంత ఆరోపణలు చేసి నిరూపించలేకపోయారని మండిపడ్డారు.దాచుకో,దోచుకో విధానాన్ని కాంగ్రెస్ నాయకులు అనుసరిస్తూ ప్రజల రక్తాన్ని పీలుస్తున్న జలగలుగా తయారు అయినారని విమర్శించారు.ఈ సమావేశoలో బోలెమోని. లక్ష్మయ్య,నందిమల్లఅశోక్,గంధంపరంజ్యోతి, మండల పార్టీ అధ్యక్షులు రాళ్ళకృష్ణయ్య, కె.మాణిక్యం,రఘువర్ధన్ రెడ్డి,వేణు గోపాల్,గులాం ఖాదర్ ఖాన్,నాగన్న యాదవ్ ,వెంకట్ సాగర్, సూర్య వంశంగిరి,చిట్యాలరాము, జోహెబ్ హుస్సేన్,నీలస్వామి,ఎర్ర.శ్రీనివాసులు,బొబ్బిలి.ప్రేమ్ కుమార్,చంద్రశేఖర్,లక్ష్మీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Spread the love

Related News

Latest News