Trending Now

పోలీసుల తనిఖీల్లో భారీగా పట్టుబడ్డ నగదు..

ప్రతిపక్షం, సిద్దిపేట ప్రతినిధి, మార్చి 23: గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద శుక్రవారం రాత్రి వాహన తనిఖీలలో రూ. 50 లక్షల రూపాయలు పట్టుబడ్డాయని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ తెలిపారు. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ సీఐ సైదా, అడిషనల్ సీఐ ముత్యం రాజు, సిబ్బంది, కేంద్ర బలగాలు సీఐఎస్ఎఫ్ సిబ్బందితో కలసి గజ్వేల్ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. రాయపోల్ కు చెందిన బచ్చు రత్నాకర్ ( TS36C-O198) తన కారులో 50 లక్షల రూపాయలు ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకు వెళుతుండగా సీజ్ చేసినట్లు సీపీ తెలిపారు. 50 వేలకు మించి ఎవరు కూడా డబ్బులు వాహనాలలో తీసుకొని వెళ్లవద్దని సూచించారు. ఎక్కువ తీసుకొని వెళ్ళినచో తప్పకుండా దానికి సంబంధించిన పత్రాలు వెంబడి ఉంచుకోవాలని సూచించారు.

Spread the love

Related News

Latest News