ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌కు నిరసనగా బీఆర్‌ఎస్ పార్టీ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు పార్టీ శ్రేణులు, మహిళలు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని, కేంద్రానికిని రసన తగలాలని సూచించింది. మహిళా సంఘాలు, సంస్థలు, మహిళలు పెద్దఎత్తున హాజరయ్యేలా ప్లాన్ చేస్తోంది.