ప్రతిపక్షం, వెబ్ డెస్క్: లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. తన కొడుకుకు పరీక్షలు ఉన్నందున ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. గత నెల 15న హైదరాబాద్ లో కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మార్చి 26 నుంచి కవిత తీహార్ జైలులో ఉన్నారు.