Trending Now

గుర్తింపు పొందిన డీలర్ల దగ్గరే విత్తనాలు కొనుగోలు చేయాలి : కలెక్టర్

ప్రతిపక్షం, ప్రతినిధి, ములుగు, మే 30: వ్యవసాయ శాఖ గుర్తింపు పొందిన డీలర్ల దగ్గరే విత్తనాలు కొనుగోలు చేయాలని, జిల్లాలో నకిలీ విత్తనాలు నియంత్రణకు జిల్లా స్థాయిలో 2 టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ శాఖ గుర్తింపు పొందిన డీలర్ల దగ్గరే విత్తనాలు కొనుగోలు చేయాలని, విడిగా ఉన్న సంచుల్లోని విత్తనాలను కొనుగోలు చేయరాదని, సంబంధిత కంపెనీ లేబుల్ ఉన్న ప్యాకెట్లను కొనాలని తెలిపారు. కొనుగోలు చేసిన విత్తనాల ఖాళీ ప్యాకెట్లను, బిల్లులను పంటకాలం పూర్తయ్యే వరకు భద్రంగా ఉంచుకుంటే ఒకవేళ నకిలీ విత్తనాల కారణంగా దిగుబడి రానప్పుడు సంబంధిత డీలర్లపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు.

వదంతులు నమ్మవద్దు..

కొంతమంది విత్తన కంపెనీలు, వ్యాపారం నిమిత్తం తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఏ రకమైన పత్తి విత్తనలైన దిగుబడి ఒకే రకంగా ఉంటుంది. సాగు పద్ధతులు భూమి లోపల ఉన్న బలం ఆధారంగా పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. రకాలను బట్టి కాదు. అన్ని రకాల పత్తి విత్తనాలు మంచివే. విత్తనాలు కొన్న వెంటనే ఇంటి లోపల భద్రపరుచుకోవాలి. ఎండవేడికి పెట్టరాదు. నకిలీ విత్తనాల నియంత్రణ కోసం సహాయ వ్యవసాయ సంచాలకులు ములుగు, ఏటూరు నాగారం, విత్తన ధ్రువీకరణ అధికారి పోలీసు అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని, వీరు 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని, రైతులు ఎవరైనా బిజి-3, హెచ్.టి ప్రతి విత్తనాలు రాత్రి వేళల్లో గ్రామాల్లో తిరిగి అమ్మే విత్తనాలు గురించి సమాచారం తెలిస్తే టాస్క్ ఫోర్స్ అధికారులు ములుగు సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీపాల్ 7288894761, ఏటూరు నాగారం సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీధర్ 7288894766, ఫోన్ నెంబర్ లకు సమాచారం అందించాలని, అధికారులకు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడును. వ్యవసాయ శాఖ, టాస్క్ ఫోర్స్ యంత్రాంగం సహాయంతో వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నకిలీ విత్తనాలు అరికట్టడంలో ఎవరైనా తమకు తెలిసిన సమాచారం ఉంటే అందించి రైతు సంక్షేమానికి తోడ్పడగలరని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News