Trending Now

నిర్మల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా పల్లకి సేవ..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 15 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి శనివారం ఆనవాయితీగా నిర్వహించే స్వామి వారి పల్లకి సేవ ఆలయ ప్రదక్షణ అత్యంత భక్తి ప్రపత్తుల మధ్య శనివారం నిర్వహించుకున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి కి పూజలు నిర్వహించిన నైవేద్యాలను సమర్పించుకున్నారు.ఈ సందర్భంగా అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ ఆమిడ శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి శనివారం నిర్వహించే పల్లకి సేవ పల్లకి ప్రదక్షణకు అత్యంత బాధ్యతగా భక్తి ప్రపత్తులతో నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు.ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ముందస్తుగానే భక్తులకు ఎలాంటి ఆసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు, అర్చకులు, దేవాదాయశాఖ అధికారులు, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు.

Spread the love

Related News