Trending Now

ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: విలక్షణ నటుడు షాయాజీ షిండే ఆసుపత్రిపాలయ్యారు. ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించి, యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం షిండే పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే ఆయనను డిశ్చార్జ్ చేయనున్నారు. గతంలోనూ ఒకసారి షిండే ఛాతీనొప్పికి గురయ్యారు. షిండే తెలుగు సినిమాలలోనే కాక వేరే భాషల్లో కూడా నటించారు. ఠాగూర్, కృష్ణ, పోకిరి లాంటి ఎన్నో హిట్ సినిమాలలో ఈ కీలక పాత్రా పోషించారు.

Spread the love

Related News

Latest News