ప్రతిపక్షం, రామగిరి(మంథని), ఏప్రిల్ 22 : కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కే ప్రజల దీవెనలు మెండుగా ఉన్నాయని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ళ శ్రీనుబాబు అన్నారు. సోమవారం రామగిరి మండలంలోని కల్వచర్లలో గల శ్రీఅభయాంజనేయ స్వామి దేవాలయంలో దుద్దిళ్ళ శ్రీనుబాబుతో కలిసి వంశీకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనుబాబు, వంశీ కృష్ణ లకు ఘనంగా స్వాగతం పలికి, ఆశీర్వచనం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషిచేసి, రాబోయే ఎంపీ ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణ ని భారీ మెజార్టీతో గెలిపించగలనీ దుద్దిళ్ళ శ్రీను బాబు కార్యకర్తలను ఉద్దేశించి దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు నాయకురాళ్ళు, కాంగ్రెస్ అనుబంధ శాఖల నాయకులు తదితరులు పాల్గొన్నారు.