Trending Now

పారమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించండి..

నిర్మల్‌లో ఎన్నికల ప్రచారం చేపట్టిన డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 9 : ఉమ్మడి అదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు అన్నారు. దిలావర్ పూర్ మండలం గుండంపెల్లి ,దిలావార్ పూర్ ,కాల్వ ,గ్రామలలో లోక్ సభ ఎన్నికల ప్రచారం చేపట్టారు.. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేసే గ్యారంటీ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ముఖ్యంగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తారని అన్నారు. ఆగష్టు 15 లోపు రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతిపక్షాలు మాత్రం రాజకీయంగా లబ్ధి పొందడానికి తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఉమ్మడి పార్లమెంట్ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఆదివాసి గిరిజన మహిళ పేద ఆంటీ బిడ్డ ఆత్రం సుగుణ కు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి ఆత్రం సుగుణ గారిని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమం లో దిల్వార్ పూర్ ఎంపీపీ అనిల్ ,మండల పార్టీ అధ్యక్షులు సాగర్ రెడ్డి ,మాజీ ఏఎంసీ చైర్మన్ దేవేందర్ రెడ్డి ,అరుగుల రమణ ,కాల్వ నర్సారెడ్డి ,మహేందర్,తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News