ప్రతిపక్షం, ఏపీ: వైసీపీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన రాజకీయ ప్రస్తానానికి సంబంధించి ఈరోజు కీలక ప్రకటనన చేసే అవకాశం ఉంది. వైసీపీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుకు.. తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన గత కొద్ది రోజుల నుంచి మౌనంగా ఉంటున్నారు. ఇదే సమయంలో తన సన్నిహితులు.. మద్దతుదారులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటున్నారు. వేమిరెడ్డి అసంతృప్తిగా ఉన్నారని గుర్తించిన టీడీపీ నేతలు ఆయనతో సమావేశమై తమ పార్టీలోకి రావాలని కోరారు. మాజీ మంత్రి నారాయణతో పాటు పలువు నేతలు ఆయనతో ఇప్పటికే చర్చించినట్లు సమాచారం.
గత వారం రోజులుగా ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారోనని జిల్లా వ్యాప్తంగా నెలకొని ఉంది. ఇప్పటివరకు ఆయన మౌనంగా తన పని తాను చేసుకుని పోతున్నారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ కొద్ది రోజుల్లోనే రానున్న నేపథ్యంలో వైసీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాజకీయాలకు దూరంగా ఉంటారా..? లేక టీడీపీలో చేరతారా..? అన్నది నేడు తేలనుంది.
టీడీపీలోకి వస్తే నెల్లూరు లోక్ సభ నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఆయన పార్టీ మారుతారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. రెండు రోజుల క్రితం నెల్లూరుకు వచ్చిన ఆయన సన్నిహితులతో భేటీ అయ్యారు. రెండు, మూడు రోజులు తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆయన వారితో చెప్పినట్టు తెలిసింది. నిన్న చెన్నైకి వెళ్ళిన వేమిరెడ్డి ఈరోజు నెల్లూరుకు రానున్నారు.. ఇవాళ మరోసారి తన మద్దతు దారులతో సమావేశమై ఆయన ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.