ప్రతిపక్షం, ఏపీ: ఇంతకాలం పాటు వైసీపీ లోనే ఉంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కి కంటిలో నలుసులా మారిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు నేడు వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి పంపించారు. అయితే రఘురామ తన పదవికి సైతం రాజీనామా చేయబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఆయన తన లోక్‌సభ సభ్యత్వాన్ని వదులుకునే లేదని.. పదవికి రాజీనామా చేయబోనని ఇప్పటికే చెప్పేశారు. ఈ క్రమంలోనే రఘురామ కేవలం పార్టీకి మాత్రమే రాజీనామా చేశారు.
2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున నర్సాపురం పోటీ చేసి గెలిచిన రఘురామకృష్ణరాజు…కొద్ది కాలానికే పార్టీతో విభేదించారు. తాజాగా ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపించారు.