Trending Now

IPL 2024: నేడు బెంగళూరుతో గుజరాత్ ‘ఢీ’

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఐపీఎల్2024 కీలక దశకు చేరింది. ప్లేఆఫ్స్‌లో బెర్తు కోసం జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాగా.. ఈసారి ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన బెంగళూరు, గుజరాత్ ఈరోజు తాడోపేడో‌ తేల్చుకునే మ్యాచ్‌లో తలపడనున్నాయి. గెలిచిన జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాల సంగతి పక్కన పెడితే.. ఓడిన జట్టు మాత్రం ఇంటిముఖం పట్టక తప్పదు. GT 8, RCB 6 పాయింట్లతో 8, 10వ స్థానాల్లో ఉన్నాయి. ఇరుజట్ల ముఖాముఖీ పోరులో 2-2తో సమవుజ్జీలుగా ఉన్నాయి.

ముంబై ఇండియన్స్‌పై కోల్‌కతా విజయం..

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైంది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై సూర్యకుమార్(56) మినహా మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో 145 పరుగులకే ఆలౌటైంది. కేకేఆర్ బౌలర్లలో స్టార్క్ 4, వరుణ్, నరైన్, రసెల్ తలో 2 వికెట్లు తీశారు. ఈ పరాజయంతో ముంబై ప్లేఆఫ్స్ ఆశలు దాదాపుగా గల్లంతయ్యాయి.

ఈ సీజన్‌లో ఇదే తొలి సారి..

ముంబై, కోల్‌కతా మధ్య మ్యాచులో చెత్త ఫీట్ చోటు చేసుకుంది. ఒకే మ్యాచులో ఇరు జట్లు ఆలౌట్ అయ్యాయి. దీంతో ఈ సీజన్‌లో ఓకే మ్యాచులో రెండు టీమ్స్ ఆలౌటైన తొలి మ్యాచుగా నిలిచింది. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఇలా నాలుగు సార్లు జరిగింది. 2010లో DCvsRR, 2017లో KKRvsRCB, 2018లో MIvsSRH మ్యాచుల్లో రెండు జట్లు ఆలౌటయ్యాయి.

12 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి..

ముంబైతో మ్యాచులో విజయం KKRకు ప్రత్యేకంగా నిలిచిపోయింది. 12 ఏళ్ల తర్వాత వాంఖడే వేదికగా ముంబైపై కోల్‌కతా విజయం సాధించడం గమనార్హం. చివరిసారిగా వాంఖడేలో ముంబైపై 2012లో గెలుపొందింది. ఓవరాల్‌గా వాంఖడే వేదికగా ఇరు జట్ల మధ్య 11 మ్యాచులు జరగ్గా KKR 9 మ్యాచుల్లో ఓడిపోగా, 2 మ్యాచుల్లో గెలుపొందింది.

Spread the love

Related News