Trending Now

మోదీ రాష్ట్ర పర్యటనలో స్వల్ప మార్పు..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: ప్రధాని నరేంద్రమోదీ మరోసారి రాష్ట్రంలో పర్యటించనున్నారు. మార్చి 15,16,18 తేదీల్లో తెలంగాణకు రానున్నారు. ఈ నెల 15వ తేదీన మల్కాజ్​గిరి పార్లమెంట్ పరిధిలో భారీ రోడ్ షోలో పాల్గొంటారు. 16వ తేదీన నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో, 18న జగిత్యాలలో ఎన్నికల సభకు హాజరవుతారు. తెలంగాణ లోక్​సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న బీజేపీ ఎన్నికల ప్రచారంలో స్పీడు పెంచింది. ఇప్పటికే ఒక దఫా తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ ఈ నెల 15, 16, 18 తేదీల్లో మరోసారి పర్యటించనున్నారు. జగిత్యాల, నాగర్​ కర్నూల్, మల్కాజిగిరిల్లో జరిగే ప్రధాని సభలకు బీజేపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీన మల్కాజ్​గిరి పార్లమెంట్ పరిధిలో భారీ రోడ్ షో నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేస్తోంది. దాదాపు గంటన్నరకు పైగా రోడ్ షో నిర్వహించాలని భావిస్తోంది. అమిత్ షా సమావేశం అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలు సమావేశమై రోడ్ షో గురించి చర్చించారు. రేపు రాష్ట్ర కార్యాలయంలో మల్కాజ్​గిరి రోడ్ షోపై సన్నాహక సమావేశం జరగనుంది. 16వ తేదీన నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో 18న జగిత్యాలలో మోదీ ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు.

Spread the love

Related News