- ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
ప్రతి పక్షం, దుబ్బాక, జూన్ 02: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని భూంపల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్థూపానికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన అమరవీరుల సేవలను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదన్నారు. యువత, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు చేసిన ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.అనంతరం అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు , స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


















